Ponnur: వైసీపీకి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు ఎమ్మెల్యే ధూళిపాళ్ల

Ponnur: పొన్నూరులో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్. మెగా డీఎస్సీపై వైసీపీ ఆరోపణలు అవాస్తవం, దమ్ముంటే ఉద్యోగాలు పొందిన వారిని కలవాలని సవాల్.

SHAREEF, PONNURU
Published on: 4 Aug 2026 6:36 PM IST
Ponnur
X

Ponnur: వైసీపీకి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు ఎమ్మెల్యే ధూళిపాళ్ల

పొన్నూరు: అధికారంలో ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా యువతను మోసం చేసి విధ్వంసం అరాచకాలతో పాలన సాగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెగా డీఎస్సీ పై మాట్లాడే అర్హత లేదని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ విమర్శించారు.

మెగా డీఎస్సీ పై వైకాపా చేస్తున్న ఆరోపణలను గుంటూరు జిల్లా పొన్నూరులో ఎమ్మెల్యే ధూళిపాళ్ల పార్టీ శ్రేణులతో కలసి ఖండించారు. ఈ సందర్భంగా ధూళిపాళ్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేయడం జరిగిందని దానిపై 200కు పైగా కేసులు వేసిన న్యాయ పరంగా వాటిని అధిగమించి పారదర్శకంగా డీఎస్సీని నిర్వహించామన్నారు.

ఎంపికైన అభ్యర్థులు శిక్షణ పొంది ఉద్యోగాలు చేస్తున్నారని దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు వైకాపా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఇప్పుడు ఆరోపణలు చేస్తుందని ఎద్దేవా చేశారు.

వైకాపా వారికి దమ్ముంటే క్షేత్రస్థాయిలో ఉద్యోగాలు పొందిన వారిని కలసి నిజ నిజాలు నిర్ధారించుకోవాలని సవాల్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే వైకాపా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉద్యోగాలు పొందిన వారి కుటుంబాల్లో భయాందోళనలు కలిగించే విధంగా వ్యవహరించడాన్ని ధూళిపాళ్ల తీవ్రంగా ఖండించారు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU

Next Story