Guntur: పొన్నూరులో వైయస్ఆర్ వర్ధంతి; అంబటి మురళీకృష్ణ నివాళి!

Guntur: పెదకాకానిలో వైయస్ఆర్ వర్ధంతి వేడుకలు; విగ్రహానికి నివాళులర్పించిన వైయస్సార్‌సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ.

SHAREEF, PONNURU
Published on: 2 Sept 2026 1:05 PM IST
Guntur
X

Guntur: పొన్నూరులో వైయస్ఆర్ వర్ధంతి; అంబటి మురళీకృష్ణ నివాళి!

Guntur: జన హృదయనేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని సెంటర్లో గల డాక్టర్ వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పొన్నూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ పేదల పెన్నిధి, రైతు బాంధవుడు, జలయజ్ఞ ప్రదాత అని, వ్యవసాయాన్ని పండుగ గా మార్చిన రైతు నేస్తం అని, పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు పరితపించిన మహా నేత డాక్టర్ వైఎస్ఆర్ అని కొనియాడారు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU

Next Story