Guntur: గుంటూరు బాలిక మిస్సింగ్ కేసు ఛేదన: నిందితుడి అరెస్ట్!
Guntur: గుంటూరు పట్టాభిపురంలో జూన్ 10న అదృశ్యమైన పదో తరగతి బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు.
Guntur: గుంటూరు బాలిక మిస్సింగ్ కేసు ఛేదన: నిందితుడి అరెస్ట్!
గుంటూరు: గుంటూరులో పదో తరగతి బాలిక జూన్ 10న మిస్సింగ్ కేసు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో నమోదయ్యింది. జాన్ సైదా అలియాస్ రబ్బానీ బాలికను తీసుకెళ్లాడు. గుంటూరు నెల్లూరు, తమిళనాడు, కేరళ, మళ్ళీ హైదరాబాద్ వెళ్లారు.
కంటిన్యూగా ప్లేసులు మార్చడంతో గుర్తించడం కష్టమయ్యింది. హైకోర్టులో బాలిక తండ్రి హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. డీజీపీ ఆదేశాలతో సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టాం. మొత్తం ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపులు చేపట్టాం. హర్యానా రాష్ట్రం కర్నాల్ లో బాలికతోపాటు జాన్ సైదాను అదుపులోకి తీసుకున్నారు. జాన్ సైదాతో బాలికకు రెండేళ్లుగా పరిచయం ఉంది.
పెళ్లి చేసుకుంటామని జాన్ సైదా బాలిక తల్లిదండ్రులను అడిగాడు. జాన్ సైదా సోదరికి కూడా ఈ విషయం తెలుసు. పోక్సో, అత్యాచారం, కిడ్నాప్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. మిస్సింగ్ కేసు విచారణలో పోలీసులు ఎలాంటి అలసత్వం చూపించలేదు. కేసు కంటిన్యూగా ఫాలోఅప్ చేశాం. ఇన్ స్టానుంచి మిస్ కాల్ రావడంతో ట్రేస్ చేశాం. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లనుంచి డేటా రావడం ఆలస్యమయ్యింది.




