Piduguralla: ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ హాల్ట్ ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే!
Piduguralla: రైల్వే స్టేషన్‌లో విజయవాడ-లింగంపల్లి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు హాల్ట్‌ను ప్రారంభించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే యరపతినేని.
Piduguralla: ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ హాల్ట్ ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే!
Piduguralla: పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ నందు గురజాల నియోజకవర్గం పరిధిలోని ప్రయాణికుల అవసరాల దృష్ట్యా నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారి కృషితో రైలు నెంబర్ 12795 విజయవాడ నుండి లింగంపల్లి ,
రైలు నెంబర్ 12796 లింగంపల్లి నుండి విజయవాడ ఇంటర్ సిటీ రైలు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ నందు ఆగనున్న నేపథ్యంలో పిడుగురాళ్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ నందు నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు, గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు,
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు శ్రీ జంగా కృష్ణమూర్తి గారు, యువనాయకులు యరపతినేని నిఖిల్ గారు విజయవాడ నుండి లింగంపల్లి వెళ్తున్న 12795 నెంబర్ రైలుని పచ్చ జెండా ఊపి ప్రారంబించటం జరిగింది.




