Pedanandipadu: PHC భవనానికి కేంద్రమంత్రి పెమ్మసాని శంకుస్థాపన!

Pedanandipadu: పెదనందిపాడులో రూ. 1.93 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి కేంద్రమంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే రామాంజనేయులు శంకుస్థాపన చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 31 Aug 2026 2:58 PM IST
Pedanandipadu
X

Pedanandipadu: PHC భవనానికి కేంద్రమంత్రి పెమ్మసాని శంకుస్థాపన!

Pedanandipadu: పెదనందిపాడులో స్థానిక ఎమ్మెల్యే బి. రామాంజనేయులు గారితో కలిసి 15వ ఆర్థిక సంఘ నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముఖ్యఅతిథిగా సోమవారం పాల్గొన్నారు.

పెమ్మసాని గారి కామెంట్స్

ప్రజలకు వైద్య సదుపాయాలు, ప్రసవ సదుపాయాలు, ప్రాథమిక చికిత్సలు అందుబాటులో ఉండే విధంగా ఒకటి పాయింట్ రూ. 1.93 కోట్ల నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి ఈరోజు ఎమ్మెల్యే గారితో కలిసి శంకుస్థాపన నిర్వహించడం జరిగింది.

జిజిహెచ్ వంటి జిల్లా ప్రధాన ఆసుపత్రిపై లోడ్ ఎక్కువ పడకుండా ఇలాంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజల సమస్యలకు ప్రధాన పరిష్కార మార్గంగా పనిచేసినప్పుడే గ్రామ గ్రామానికి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.

గతంలో నిర్మించినటువంటి భవనం రూఫ్, స్లాబ్స్ సరిగా నిర్మాణం కాకపోవడం వలన అలాగే ఉప్పునీటి సమస్య కారణంగా భవన నిర్మాణం పటిష్టంగా ఏర్పాటు చేయకపోవడం జరిగింది. ఆ సమస్యకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి మేము శ్రీకారం చుట్టాము.

ప్రజలు కూడా ఈ నిర్మాణంలో భాగస్వామ్యలు అయి ఈ నిర్మాణం మనది అనే భావనతో దగ్గరుండి పర్యవేక్షించి, నిర్మాణానంతరం కూడా నిర్వహణ విధానాన్ని గమనిస్తూ ఉండాలి.

ఎమ్మెల్యే రామాంజనేయులు గారి కామెంట్స్

గత వైసిపి పాలనలో ఇక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం నిర్లక్ష్యానికి గురైంది. చిన్న చిన్న మరమ్మతులు ఉన్నాయని ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న వాళ్ళు లేరు. చికిత్స నిమిత్తం వచ్చే రోగులకు ఉపయోగపడేలా సౌకర్యాలు కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమైంది.

దీంతో నూతన భవన నిర్మాణం అవసరం ఏర్పడింది. కాగా పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో ఈ భవనానికి రూ. 1.93 కోట్ల నిధులను సమకూర్చడం జరిగింది. అలాగే గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ రూ. 275 కోట్లు, గుంటూరు ఛానెల్ విస్తరణ పనులకుగానూ మరిన్ని కోట్లతో నిధులు సమకుర్చడంతో పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story