Vinukonda: వినుకొండలో మహిళల భద్రతపై సదస్సు.. అతిథిగా ఎస్పీ కృష్ణారావు

Vinukonda: పల్నాడు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినుకొండలో మహిళా రక్షణ, సైబర్ భద్రతపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 20 May 2026 8:48 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో మహిళల భద్రతపై సదస్సు.. అతిథిగా ఎస్పీ కృష్ణారావు

Vinukonda: పల్నాడు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని గంగినేని కల్యాణ మండపంలో మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ హనుమంతరావు అధ్యక్షత వహించగా, జిల్లా ఎస్పీ కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రతకు పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సమాజంలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

కళాశాలల్లో ఈవ్ టీజింగ్, మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగం గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవద్దని హెచ్చరించారు. పిల్లల రక్షణకు సంబంధించిన ఫోక్సో చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ కోసం ప్రతి మహిళ శక్తి యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story