Vinukonda: వినుకొండ ఆర్టీసీ బస్సులో కండక్టర్ వీరంగం
Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండ డిపో బస్సులో మద్యం మత్తులో ఆర్టీసీ కండక్టర్ వీరంగం.
Vinukonda: వినుకొండ ఆర్టీసీ బస్సులో కండక్టర్ వీరంగం
Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ డిపోకు చెందిన బొల్లాపల్లి మండలం దోమలగుండం వైపు వెళుతున్న బస్సులో డ్యూటీ ముగించుకుని ప్రయాణిస్తున్న ఓ ఆర్టీసీ కండక్టర్ మద్యం మత్తులో ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. కండక్టర్ ఒక చేతిలో సిగరెట్ పట్టుకుని బస్సులోనే ధూమపానం చేస్తూ, మహిళలు సహా తోటి ప్రయాణికులపై అసభ్య పదజాలంతో దూషించాడని ప్రయాణికులు ఆరోపించారు.
అతని ప్రవర్తనతో మహిళలు, ఇతర ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని తెలిపారు. బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి ఇలాంటి తీరును ప్రదర్శించడం ఆందోళనకరమని ప్రయాణికులు మండిపడ్డారు. ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫిర్యాదుల ఆధారంగా ఆర్టీసీ అధికారులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
ఘటనలో వాస్తవాలు నిర్ధారించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత కండక్టర్‌పై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు ఆర్టీసీ ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.




