Prathipadu: ప్రత్తిపాడులో ఘనంగా ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు ప్రారంభం!
Prathipadu: ప్రత్తిపాడులో వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఘనంగా ప్రారంభమైన జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు బల ప్రదర్శన.
Prathipadu: ప్రత్తిపాడులో ఘనంగా ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు ప్రారంభం!
Prathipadu: వినాయక చవితిని పురస్కరించుకొని ప్రత్తిపాడు మండల కేంద్రంలో నందమూరి తారక రామారావు మెమోరియల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు బల ప్రదర్శనలో గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారితో కలిసి పాల్గొన్న గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు.
ఈ సందర్భంగా స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి, ఎన్టీఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు బల ప్రదర్శనను ఎమ్మెల్యే రామాంజనేయులు గారు, ఎంపీ రామకృష్ణ గారు ఘనంగా ప్రారంభించారు.
అనంతరం శాసనసభ్యులు వారు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ మెమోరియల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు బల ప్రదర్శనను ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని.
ప్రతి సంవత్సరం వినాయక చవితి తర్వాత రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుందని, అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే బావనకు ప్రతీకగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని 360 డిగ్రీలలో ఆధుకోవాలి, రైతులకు వెన్నంటే ఉండాలనే ఆలోచన సీఎం చంద్రబాబు గారిదని రాష్ట్రాన్ని అభివృద్ధి మరియు సంక్షేమంలో ముందుకు సాగుతున్న చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషమని, ఒంగోలు జాతి అంతరిస్తున్న తరుణంలో, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.




