Guntur: ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే బూర్ల!

Guntur: గుంటూరు జిల్లా బోడిపాలెంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు హాజరు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 29 Aug 2026 10:11 PM IST
Guntur
X

Guntur: ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే బూర్ల!

Guntur: కోట్లాది మంది తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతిరూపం ఎన్టీఆర్ - ఎమ్మెల్యే డా.బూర్ల రామాంజనేయులు గారు.

కాకుమాను మండలం, బొడిపాలెం గ్రామంలో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు,యుగపురుషులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు,స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కలిసి పాల్గొన్న గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు గారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మరియు గౌరవ ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు గారికి అభిమానులు, కార్యకర్తలు మహిళలు ఘన స్వాగతం పలికారు, అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన గ్రామస్థులు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్.. రాజకీయ రంగంలోకి ప్రవేశించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టి తెలుగు ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని, ఆత్మగౌరవాన్ని అందించిన మహానేతగా చరిత్రలో నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు.పేదలు, బడుగు బలహీన వర్గాలు, రైతులు, మహిళల సంక్షేమం కోసం ఎన్టీఆర్ గారు చేసిన సేవలు చిరస్మరణీయమని,ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నేటికీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి.తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ఆయన కేవలం ఒక నాయకుడు కాదు.. కోట్లాది మంది తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతిరూపమని కొనియాడారు.సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని చాటిచెప్పిన మహనీయులు ఎన్టీఆర్ గారని,వారి ఆశయంలో భాగంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని, అలాగే విగ్రహధాత రావిపాటి వెంకటరావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU

Next Story