Chirala: చీరాలలో వినాయక చవితి సందడి.. మార్కెట్లలో భారీ రద్దీ!

Chirala: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా చీరాల నెహ్రూ మార్కెట్‌లో భక్తుల సందడి నెలకొంది. ధరలు పెరిగినప్పటికీ పూజా సామాగ్రి కొనుగోళ్లు జోరుగా సాగాయి.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 13 Sept 2026 10:19 PM IST
Chirala
X

Chirala: చీరాలలో వినాయక చవితి సందడి.. మార్కెట్లలో భారీ రద్దీ!

చీరాల: బాపట్లా జిల్లా చీరాలలో వినాయక చవితి సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే వినాయక చవితి వచ్చిందంటే ఒక రోజు ముందె వాడవాడలా వీధి వీధినా హడావిడి మొదలవుతుంది.

చీరాల ప్రధాన మార్కెట్ అయిన నెహ్రూ మార్కెట్ వద్ద జాతరను తలపించే విధంగా ప్రజలు కోలాహలంతో, పూజా సామాగ్రి కొనుగోళ్లతో ఎంతో సందడి వాతావరణం సంతరించుకుంటుంది. ముఖ్యంగా వినాయకుడిని, పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకోవడానికి రకరకాల అలంకరణ సామాగ్రి మార్కెట్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పిల్లలు పెద్దలు పూజ కోసం వినాయకుని ప్రతిమను వివిధ రకాల అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసికొని వెళ్తున్నారు.

ఈ సంవత్సరం కొంత ధరలు పెరగడంతో కొంత నిరసకు లోనైనా గణపతి పూజ సామాగ్రి కొనుగోలు చూస్తున్నారు. చీరాలలో జిల్లాలో ప్రతి గ్రామంలో వినాయకుని ప్రతిష్టించడానికి మన్యవాసులు సిద్ధమవుతున్న తరుణంలో వినాయక విగ్రహముల నుండి కొబ్బరికాయ అరటిపళ్ళు అలంకరణ సామాగ్రి వరకు ధరలు ఆకాశాన్ని అంటుతుండడం విశేషం.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala