Chirala: చీరాలలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ సన్నాహక సమావేశం!
Chirala: చీరాలలో 17వ తేదీన నిర్వహించనున్న విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం, ఆయుధ పూజ ఏర్పాట్లపై కూటమి నేతలు జనసేన కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
Chirala: చీరాలలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ సన్నాహక సమావేశం!
చీరాల: విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం సన్నాహ సమావేశానికి కూటమి నాయకులు చీరాల లోని 16 వార్డు లో జనసేన కార్యాలయం జనసేన నాయకులు కడలి లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేసి 17వ తారీకు జరిగు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము మరియు ఆయుధ పూజా కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఏవిధంగా నిర్వహించాలి , చర్చించడం జరిగినది.
ఈ కార్యక్రమానికి చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ సమన్వయంతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని విశ్వకర్మ యజ్ఞ కార్యక్రమాన్ని కార్మికుల దినోత్సవం గా నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు డాక్టర్ తాడివలస దేవరాజు, మానేపల్లి బాలాజీ, సన్నమూరి శ్రీనివాస్ చారి, జనసేన నాయకులు, కడలి లక్ష్మణ్, హనుమకొండ కిషోర్ , పాలవలస శ్రీనివాస్ , పాపిశెట్టి అంజిబాబు పాల్గొన్నారు.




