Mangalagiri: నరసింహస్వామి ఆలయంలో యాగశాలకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
Mangalagiri: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రూ.6.50 కోట్లతో యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. భక్తులకు మెరుగైన వసతులు.
Mangalagiri: నరసింహస్వామి ఆలయంలో యాగశాలకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం దిగువ సన్నిధిలో అత్యాధునిక యాగశాల నిర్మాణానికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.
సుమారు రూ.6 కోట్ల 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న, ఈ యాగశాల ద్వారా ఆలయంలో నిర్వహించే యాగాలు, హోమాలు, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరింత విశాలమైన, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ఈ నిర్మాణం భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్, దేవస్థానం అధికారులు, ప్రజాప్రతినిధులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
Next Story




