Ponnur: పొన్నూరులో దారుణం ప్రియుడితో కలిపి కన్నతల్లిని చంపిన కూతురు!
Ponnur: పొన్నూరు క్యాబిన్ పేటలో దారుణం ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన కూతురు.. రూ.నగదు గొడవే కారణమని బంధువుల ఆరోపణ.
Ponnur: పొన్నూరులో దారుణం ప్రియుడితో కలిపి కన్నతల్లిని చంపిన కూతురు!
Ponnur: గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని క్యాబిన్ పేటకు చెందిన ఈపూరు లక్ష్మి(45) శనివారం తెల్లవారుజామున హత్యకు గురైంది. కూతురు పుష్పలత తన ప్రియుడు రాజాతో కలిసి లక్ష్మిని హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.
పుష్పలత మొదటి భర్త చనిపోగా, విజయవాడకు చెందిన రాజాతో సహజీవనం చేస్తుందని బంధువులు చెప్తున్నారు... కూతురు పుష్పలత నెల రోజుల క్రితమే తల్లి వద్దకు వచ్చి ఉంటుందని అంటున్నారు. నగదు విషయంలో తల్లి కూతురుకు గొడవ జరగడంతో ఈ హత్య జరిగినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.




