Guntur: గుంటూరు బస్టాండ్‌లో దొంగల హల్‌చల్: ఫోన్ మాయం!

Guntur: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ప్లాట్‌ఫారమ్ 32 వద్ద బీటెక్ విద్యార్థిని గాయత్రి రెడ్డి ఫోన్ చోరీ. సీసీ టీవీలో దృశ్యాలు రికార్డ్. పోలీసుల తీరుపై బాధితుల ఆగ్రహం.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 6 Sept 2026 9:49 AM IST
Guntur
X

Guntur: గుంటూరు బస్టాండ్‌లో దొంగల హల్‌చల్: ఫోన్ మాయం!

Guntur: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగలు రెచ్చిపోతున్నారా? ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని పట్టపగలే చోరీలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. బస్టాండ్‌లో పోలీస్ ఔట్‌పోస్ట్ ఉన్నప్పటికీ ప్రయాణికుల వస్తువులకు భద్రత లేకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దొంగతనాలను అరికట్టాల్సిన పోలీసుల పర్యవేక్షణపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న గాయత్రి రెడ్డి అనే విద్యార్థిని ఖరీదైన ఫోన్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్లాట్‌ఫారం నంబర్ 32లో చీరాల బస్సు ఎక్కుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రయాణికుల రద్దీని అదనుగా చేసుకున్న ఓ వ్యక్తి గాయత్రి రెడ్డి వెనుక నుంచి వచ్చి, ఆమె జేబులో ఉన్న ఫోన్‌ను చాకచక్యంగా కొట్టేసి అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ దృశ్యాలు బస్టాండ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు తెలుస్తోంది.

బస్సు ఎక్కిన తర్వాత ఫోన్ కనిపించకపోవడంతో విద్యార్థిని ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. వెంటనే బస్సు దిగి బస్టాండ్‌లోని పోలీస్ ఔట్‌పోస్ట్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించింది. అయితే అక్కడ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, తన ఫిర్యాదును పట్టించుకోకుండా వెళ్లిపోయారని విద్యార్థిని ఆరోపించింది.

తర్వాత అక్కడికి వచ్చిన ఓ లేడీ హోంగార్డు విద్యార్థినిని ఓదార్చి, ఆమె నుంచి రిపోర్టు రాయించినట్లు గాయత్రి రెడ్డి తెలిపింది.

చోరీ జరిగిన వెంటనే సమాచారం ఇచ్చినా.. స్పందన మాత్రం ఆలస్యమే అన్న రీతిగా పోలీసులు వ్యవహరించినట్లు తెలుస్తోంది. వారు సకాలంలో స్పందించినట్లయితే బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోనే ఆ దొంగను పట్టుకొని ఆ ఫోనును రికవరీ చేయగలిగే వారిని విద్యార్థిని తల్లిదండ్రులు అంటున్నారు. పోలీస్ హెల్ప్ లైన్ 112 కు ఫోన్ చేస్తే తప్ప పాత గుంటూరు పోలీసులకు కొంచెం చలనం కలిగిందని వారు చెబుతున్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story