Valaparla: ‘2 ఏళ్ల నమ్మకం’తో ఇంటింటికీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు!

Valaparla: బాపట్ల జిల్లా మార్టూరు, వలపర్లలో '2 ఏళ్ల నమ్మకం' కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలు వివరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 26 Aug 2026 7:45 PM IST
Valaparla
X

Valaparla: ‘2 ఏళ్ల నమ్మకం’తో ఇంటింటికీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు!

వలపర్ల: రెండు సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఇంటింటి పర్యటనకు శ్రీకారం చుట్టారు. బుధవారం ‘2 ఏళ్ల నమ్మకం’ కార్యక్రమంలో భాగంగా మార్టూరు, వలపర్లలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు , నియోజకవర్గంలో రెండేళ్లలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన రూపొందించిన కరపత్రాలను అందజేశారు. ప్రభుత్వ పాలనలో రెండేళ్లలో జరిగిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు ఎమ్మెల్యే ఏలూరి వివరించారు. గత పాలనలో ఎదురైన ఇబ్బందులు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు, గ్రామాల్లో చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధిని తెలియజేశారు.ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే ఏలూరి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజల నుంచే తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

ప్రజల ఆదరణ, విశ్వాసమే తనకు బలమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. రాబోయే రోజుల్లోనూ పర్చూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story