Chirala: మువ్వన్నెల జెండాలతో హోరెత్తిన చీరాల.. బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే!
Chirala: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా చీరాలలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆధ్వర్యంలో భారీ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
Chirala: మువ్వన్నెల జెండాలతో హోరెత్తిన చీరాల.. బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే!
చీరాల: చీరాల నియోజకవర్గం లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరాల శాసనసభ్యులు శ్రీమద్దులూరి మాల కొండయ్య ఆధ్వర్యంలో ఆగస్టు 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్న స్వాతంత్ర్య దినోత్సవ వారోత్సవాల ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవ త్రిరంగా బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. చీరాల నల్ల గాంధీ బొమ్మ దగ్గర నుండి ముంత వారి సెంటర్ గర్ల్స్ హై స్కూల్ ఎంజిసి మార్కెట్ బస్టాండ్ మీదుగా గడియార స్తంభం వరకు జరిగిన ఈ బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు పాల్గొన్నారు. ప్రజలు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి నినాదాలతో ర్యాలీని ఉత్సాహభరితంగా నిర్వహించారు.
ప్రతి ఒక్కరిలో జాతీయ భావం, దేశభక్తి స్ఫూర్తి మరింత పెంపొందాలని ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో బిజెపి అధ్యక్షులు శ్రీ మువ్వల వెంకటరమణ, AMC చైర్మన్ కౌతరపు జనార్ధన్ వివిధ హోదాలో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మహిళలు, యువత మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. ర్యాలీ దేశభక్తి నినాదాలతో ఉత్సాహభరితంగా సాగాయి. “దేశభక్తి, ఐక్యత, అభివృద్ధి – మనందరి బాధ్యత” అనే స్ఫూర్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.




