Vinukonda: ఘనంగా తిరంగా సైకిల్ యాత్ర: పాల్గొన్న చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన 'తిరంగా సైకిల్ యాత్ర'లో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు.
Vinukonda: ఘనంగా తిరంగా సైకిల్ యాత్ర: పాల్గొన్న చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
వినుకొండ: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వినుకొండలో నిర్వహించిన తిరంగా సైకిల్ యాత్రలో ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. అధికారులు, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి జాతీయ పతాకాన్ని చేతబట్టి ఆయన సైకిల్ యాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. వారి పోరాట స్ఫూర్తితో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.
కుల, మత, ప్రాంత, రాజకీయ భేదాలకు అతీతంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని జీవీ ఆంజనేయులు కోరారు. ప్రతి ఇంటా జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశం పట్ల తమకున్న గౌరవాన్ని చాటాలని అన్నారు. ‘ఏక్ భారత్–శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తితో జాతీయ సమైక్యతను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.




