Vinukonda: యోజకవర్గ కార్యకర్తలకు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కీలక ఆదేశాలు

Vinukonda: వినుకొండ లో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ సమావేశంలో ఈ నెల 27 నుండి 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 22 July 2026 7:27 PM IST
Vinukonda
X

Vinukonda: యోజకవర్గ కార్యకర్తలకు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కీలక ఆదేశాలు

వినుకొండ: వినుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, భవిష్యత్‌లో చేపట్టాల్సిన పార్టీ కార్యక్రమాలపై నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు.

ఈ నెల 27వ తేదీ నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు జీవి తెలిపారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి గత రెండేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, చేపట్టిన కార్యక్రమాల వివరాలను ‘మై టీడీపీ’ యాప్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం పలు కీలక తీర్మానాలను ఆమోదించి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. సమావేశంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, పరిశీలకులు వక్కలగడ్డ మల్లికార్జున, మండలాల టీడీపీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA