Parchur: శేఖర్‌బాబు పాడె మోసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు!

Parchur: పర్చూరులో విషాదం. మక్కెన శేఖర్‌బాబు మృతికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నివాళులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 May 2026 2:56 PM IST
Parchur
X

Parchur: శేఖర్‌బాబు పాడె మోసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు!

పర్చూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల అధ్యక్షుడు మక్కెన శేఖర్‌బాబు మృతి పట్ల పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శేఖర్‌బాబు భౌతికకాయానికి ఎమ్మెల్యే ఏలూరి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అనంతరం శేఖర్‌బాబు అంతిమయాత్రలో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొని పాడె మోశారు.వేలాదిమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మధ్య శేఖర్‌బాబు అంతిమయాత్ర విషాద వాతావరణంలో కొనసాగింది.

గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ శేఖర్‌బాబు పార్టీ అభివృద్ధికి, గ్రామ అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నిబద్ధత గల నాయకుడిగా ఆయన సేవలను స్మరించుకున్నారు. గ్రామ ప్రజల సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండే వ్యక్తిగా శేఖర్‌బాబు నిలిచిపోయారని పేర్కొన్నారు.

శేఖర్‌బాబు లేని లోటు ఆయన కుటుంబానికే కాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా తీర్చలేనిదని ఎమ్మెల్యే అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకట్రావు, కార్పొరేషన్ డైరెక్టర్లు షేక్ శంషుద్దీన్, కోడూరి శేష బ్రహ్మచారి, తిరుమల శెట్టి శ్రీహరి ,తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నాయుడు హనుమంతరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story