Mangalagiri: రూ.18 కోట్లతో మోడల్ రైతు బజార్‌కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన

Mangalagiri: మంగళగిరి నిడమర్రు రోడ్డులో రూ.18 కోట్లతో ఆధునిక మోడల్ రైతు బజార్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. అరబిందో ఫార్మా CSR నిధులతో నిర్మాణం.

MALLESHWAR RAO, MANGALAGIRI
Published on: 27 Aug 2026 12:25 PM IST
Mangalagiri
X

Mangalagiri: రూ.18 కోట్లతో మోడల్ రైతు బజార్‌కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన

Mangalagiri: మంగళగిరిలోని నిడమర్రు రోడ్డులో మెగా వెజిటబుల్ మార్కెట్‌కు శ్రీకారం. రూ.18 కోట్ల వ్యయంతో మోడల్ రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. 5.90 ఎకరాల్లో రిటైల్, హోల్‌సేల్ మార్కెట్లుగా ఆధునిక కూరగాయల మార్కెట్ ఏర్పాటు.

రైతులు, ప్రజలకు మరింత మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేలా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు. అరబిందో ఫార్మా ట్రస్ట్ CSR నిధులతో మెగా వెజిటబుల్ మార్కెట్ నిర్మాణం. రైతులు, వినియోగదారులకు మరింత ప్రయోజనం.

102 కూరగాయల స్టాళ్లు, 54 పండ్లు–పూల స్టాళ్ల ఏర్పాటు. ఇతర వస్తువుల విక్రయాలకు 60 ప్రత్యేక షాపులు.హోల్‌సేల్ మార్కెట్‌లో 18 అన్‌లోడింగ్ ప్లాట్‌ఫామ్‌లు, 23 కూరగాయల షాపులు.

కోల్డ్ స్టోరేజీ, వెజిటబుల్ వాష్ ఏరియా, క్యాంటీన్, మరుగుదొడ్ల సౌకర్యం. వాహనాలు, టూ వీలర్స్, ఫోర్ వీలర్స్‌కు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం

సోలార్ ఎనర్జీ, ఆర్గానిక్ కన్వర్టర్, గార్బేజ్ కలెక్షన్ వంటి ఆధునిక సదుపాయాలు.

MALLESHWAR RAO, MANGALAGIRI

MALLESHWAR RAO, MANGALAGIRI

Next Story