Chirala: ఈ నెల 7న చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటన!

Chirala: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న సీఎం చంద్రబాబు చీరాల పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 5 Aug 2026 8:07 AM IST
Chirala
X

Chirala: ఈ నెల 7న చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటన!

Chirala: రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చీరాల మండలం కొత్తపేట ప్రాంతానికి వస్తున్నారని మంత్రి చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నేతన్న సేవ పథకం ద్వారా చేనేతలకు నగదు పంపిణీ కార్యక్రమం చేరాలలో జరగనుందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన పర్యటించే ప్రాంతాలను మంత్రి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రజా ప్రతినిధులు కలిసి మంగళవారం పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో పర్యటించారు. సభా వేదిక, హెలిప్యాడ్, చేనేతలతో మాట్లాడే ప్రాంతాలలో ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి మార్గ నిర్దేశం చేశారు. ముందుగా చేనేత పెద్దలతో సమావేశమయ్యారు. తదుపరి మీడియాతోను మంత్రి మాట్లాడారు.

ఎన్నికల్లో హామీలు ఇవ్వకపోయినా చేనేతల కష్టాలను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చేనేతలకు వరాలు కురిపించారని మంత్రి తెలిపారు. చేనేతలు పడుతున్న కష్టాలను గుర్తించి వారికి సంక్షేమ ఫలాలు అందించే ప్రక్రియకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. చేనేతలకు రూ.25 వేలు ఆర్థిక సహాయం అందిస్తారన్నారు. రాష్ట్రంలో 50వేల మంది చేనేతలకు నగదు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

అలాగే ప్రతి నెల రూ.నాలుగు వేలు చొప్పున పింఛన్ ఇస్తున్నారని, హ్యాండ్లూమ్ వినియోగించే చేనేతలకు 200 యూనిట్లు, అలాగే పవర్ లూమ్ వినియోగించే చేనేతలకు ఉచిత విద్యుత్ ను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. చేనేతల ఉద్యమకారుడు ప్రగడ కోటయ్య స్వగ్రామం చీరాల కావడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారని స్పష్టం చేశారు. చేనేతల సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తున్నట్లు వివరించారు.

ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోని కోస్తా ఆంధ్ర భవిష్యత్తులో గ్రోత్ ఇంజన్ లా మారుతోందని చెప్పారు. ముఖ్యంగా పర్యాటక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అభివృద్ధి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందన్నారు. ఇందులో భాగంగా కోస్తా తీర ప్రాంతాల రహదారులను అనుసంధానం చేస్తూ అభివృద్ధిలోకి నడిపిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, హ్యాండ్లూమ్స్ & టెక్స్ టైల్స్ కమిషనర్ రేఖరాణి, జిల్లా ఎస్పీ బి.ఉమా మహేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్య, బుడా చైర్మన్ సి హెచ్ రాజశేఖర్ బాబు, చీరాల, బాపట్ల, రేపల్లె ఆర్డీఓ లు నరసింహారావు, ఏ.హరి కుమార్, బి.శ్రీదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story