Vinukonda: వినుకొండలో సెప్టెంబర్ 23న మెగా జాబ్ మేళా: జీవీ ఆంజనేయులు

Vinukonda: వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెప్టెంబర్ 23న APSSDC ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 15 Sept 2026 5:06 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో సెప్టెంబర్ 23న మెగా జాబ్ మేళా: జీవీ ఆంజనేయులు

వినుకొండ: వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఈ నెల 23న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్ చదువులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. టెక్ మహీంద్రా, హెటెరో, డైకిన్, టాటా ఎలక్ట్రానిక్స్, ఎస్‌బీఐ కార్డ్, వరుణ్ మోటార్స్ వంటి సంస్థలతో పాటు 50కి పైగా కంపెనీలు ఉద్యోగ మేళాలో పాల్గొననున్నట్లు తెలిపారు.

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు వెంట తీసుకురావాలని కోరారు. అర్హతను బట్టి కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జీవి తెలిపారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA