Mangalagiri: మంగళగిరిలో జనసేనాని బర్త్‌డే జోష్ ఘనంగా భారీ బైక్ ర్యాలీ!

Mangalagiri: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మంగళగిరిలో భారీ బైక్ ర్యాలీ. APMSIDC ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో జనసైనికుల కోలాహలం.

MALLESHWAR RAO, MANGALAGIRI
Published on: 2 Sept 2026 1:01 PM IST
Mangalagiri
X

Mangalagiri: మంగళగిరిలో జనసేనాని బర్త్‌డే జోష్ ఘనంగా భారీ బైక్ ర్యాలీ!

Mangalagiri: ఈ రోజు ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జనసేన శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు APMSIDC ఛైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సాహభరిత వాతావరణంలో బైక్ ర్యాలీ కొనసాగింది.

జనసేన జెండాలతో ద్విచక్ర వాహనాలపై పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ర్యాలీ సందర్భంగా పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నినాదాలు చేశారు.

ఈ ర్యాలీ పాత మంగళగిరి సీతారామ కోవెల నుంచి ప్రారంభమై మిద్దె సెంటర్ మీదగా నరసింహ స్వామి టెంపుల్, ద్వారకా నగర్, వడ్లపూడి సెంటర్, CNR షాపింగ్ మాల్ మీదగా RRR కన్వెన్షన్ వరకు జరిగింది.

MALLESHWAR RAO, MANGALAGIRI

MALLESHWAR RAO, MANGALAGIRI

Next Story