Guntur: పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాల స్వీకరణ.. కలెక్టర్ ప్రకటన!
Guntur: గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా 2,879 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదలైంది.
Guntur: పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాల స్వీకరణ.. కలెక్టర్ ప్రకటన!
గుంటూరు, ఆగస్టు 23: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 16 మండలాలలో 257 గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నారు.
257 గ్రామ పంచాయతీలకు 2,879 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ముసాయిదా ఆదివారం విడుదల చేయడం జరిగిందని చెప్పారు. ఆయా పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 26వ తేదీ లోగా సమర్పించాలని ఆయన కోరారు.
Next Story




