Vinukonda: వినుకొండ మండలంలో లబ్ధిదారులకు అందిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు

Vinukonda: జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 1 Aug 2026 6:54 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండ మండలంలో లబ్ధిదారులకు అందిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు

వినుకొండ: వినుకొండ మండలం కోటప్పనగర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర పెన్షన్ లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్‌ సొమ్ము ఇంటి వద్దకే అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నామని తెలిపారు.

గ్రామీణ రహదారులు, తాగునీరు, విద్య, వైద్య రంగాల అభివృద్ధితో పాటు రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story