Guntur: రైల్వే ఎకోపార్క్‌లో మొక్కలు నాటిన ఇంజనీరింగ్ విద్యార్థులు!

Guntur: గుంటూరు రైల్వే ఎకోపార్క్‌లో కల్లం హరినాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 24 Aug 2026 9:31 PM IST
Guntur
X

Guntur: రైల్వే ఎకోపార్క్‌లో మొక్కలు నాటిన ఇంజనీరింగ్ విద్యార్థులు!

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా గ్రీనరీ 7 శాతంతో అట్టడుగున ఉన్న పరిస్థితుల్లో గుంటూరు నగరంలో రైల్వే ఎకోపార్క్ లో నగరంలోని పౌర సంస్థలు 1500 మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించాయని చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు.

ఈనెల 24వ తేదీన గుంటూరులోని రైల్వే ఎకోపార్క్ లో కల్లం హరినాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు కొత్తగా 100 మొక్కలు నాటడం మరొక 200 మొక్కలను సంరక్షిస్తూ పచ్చదనం పెంపుదలకు కృషి చేశారు. కల్లం హరినాథ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెక్రటరి డా|| యం. ఉమా శంకర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డా|| బి.ఎస్.బి. రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రొఫెసర్ డి. శ్రీనివాసులు నేతృత్వంలో 60 మంది విద్యార్థినీ,విద్యార్థులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మొక్కలు నాటి సంరక్షణను విజయవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ పర్యావరణ సమతుల్యత మరియు పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. నేటితరం విద్యార్థుల్లో పర్యావరణం పట్ల బాధ్యతను పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యం అన్నారు. భూతాపాన్ని తగ్గించడంలో చెట్లు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. వృక్షాలు జీవవైవిద్య పరిరక్షణకు తోడ్పడుతాయని మనం చెట్లను కాపాడితే ఆ చెట్లు మనల్ని కాపాడుతాయని వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూమిలో 31 శాతం గ్రీనరీతో ఉందని దాదాపు 3 లక్షల కోట్ల చెట్లు ప్రపంచంలో ఉన్నాయని రష్యా, బ్రెజిల్, కెనడా, అమెరికా, చైనా దేశాలలో గ్రీనరీ అత్యధికంగా ఉందని విద్యార్థులకు వివరించారు. భారత అటవీ సర్వే నివేదిక ప్రకారం భారతదేశంలో 20 శాతం గ్రీనరీ ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 18 శాతం లోపుగా ఉందని, గుంటూరు జిల్లాలో 7 శాతం మాత్రమే ఉండడం దురదృష్టకరమన్నారు.

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తోడ్పాటుతో మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైల్వే డివిజన్ అధికారులు ఎస్. మంజునాథ్, రామ శేష రెడ్డి, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణరెడ్డి పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story