Bollapalli: బస్సులు ఆపకపోతే మా చదువులు ఏమైపోవాలి అంటున్న విద్యార్థులు!
Bollapalli: జయంతి రామాపురం వద్ద ట్రాక్టర్లతో రోడ్డు బ్లాక్ చేసిన విద్యార్థులు, గ్రామస్థులు. స్కూల్ టైింగ్స్లో ఆర్టీసీ బస్సులు ఆపాలని డిమాండ్.
Bollapalli: బస్సులు ఆపకపోతే మా చదువులు ఏమైపోవాలి అంటున్న విద్యార్థులు!
బొల్లాపల్లి: వినుకొండ నియోజకవర్గం,బొల్లాపల్లి మండలం జయంతి రామాపురం వద్ద విద్యార్థులు, గ్రామస్థులు రవాణా సమస్యపై రోడ్డెక్కి ఆందోళన చేపట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలకు వెళ్లేందుకు ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులను ఆపాలని కోరుతున్నప్పటికీ, డ్రైవర్లు బస్సులు నిలపకుండా వెళ్లిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో విద్యార్థులు, గ్రామస్థులు కలిసి ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా నిలిపి ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలుపుతూ, తమ గ్రామానికి సరైన రవాణా సౌకర్యం కల్పించాలని, విద్యార్థుల పాఠశాల సమయాలకు అనుగుణంగా బస్సులు తప్పనిసరిగా ఆపాలని డిమాండ్ చేశారు.
బస్సులు ఆగకపోవడంతో విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. ఘటనతో కొంతసేపు ఆ మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.




