Mangalagiri: మంగళగిరిలో జనసేన కమిటీ భేటీ.. పాల్గొన్న ఎమ్మెల్యే పత్సమట్ల!

Mangalagiri: గుంటూరు జిల్లా మంగళగిరిలోని సి.కె. కన్వెన్షన్ హాల్‌లో జనసేన పార్టీ (Janasena Party) ప్రతిష్టాత్మక సమావేశం శనివారం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ADAPA BALA BALAJI, UNGUTURU
Published on: 27 Jun 2026 12:30 PM IST
Mangalagiri
X

Mangalagiri: మంగళగిరిలో జనసేన కమిటీ భేటీ.. పాల్గొన్న ఎమ్మెల్యే పత్సమట్ల!

మంగళగిరి: మంగళగిరిలోని సి.కె. కన్వెన్షన్ హాల్‌లో జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన నిర్వహించిన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశంలో ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సభ ఆవరణలో చిత్తూరు పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యులు చిత్తూరు పార్లమెంట్ పరిశీలకులుగా నియమితులైన ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, పార్టీ సంస్థాగత నిర్మాణం, సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ, క్షేత్రస్థాయి సమన్వయం తదితర అంశాలపై చర్చించారు.

ADAPA BALA BALAJI, UNGUTURU

ADAPA BALA BALAJI, UNGUTURU

Next Story