Palnadu: సత్తెనపల్లిలో చెరువులను తలపిస్తున్న కాలనీలు.. జలమయమైన రహదారులు!

Palnadu: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తం.

V SRIKANTH, SATTENNAPALLI
Published on: 13 Jun 2026 11:07 AM IST
Palnadu
X

Palnadu: సత్తెనపల్లిలో చెరువులను తలపిస్తున్న కాలనీలు.. జలమయమైన రహదారులు!

పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలంలో శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మండలంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

మండలంలోని నందిగామ వద్ద ఉన్న వాగు ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తోంది. ఈ వాగు నీరు రహదారిపై ఉన్న లో-లెవెల్ వంతెన మీదుగా ప్రవహిస్తుండటంతో, సత్తెనపల్లి-అమరావతి మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

భారీ వర్షానికి పట్టణంలోని నాగన్నగుంట, సుందరయ్య కాలనీ, కుమ్మరి పాలెం వంటి ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడమే కాకుండా, పలువురి ఇండ్లలోకి కూడా చేరింది. గృహోపకరణాలు నీట మునగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

V SRIKANTH, SATTENNAPALLI

V SRIKANTH, SATTENNAPALLI

Next Story