Vinukonda: వినుకొండలో భారీ వర్షం.. జలమయమైన రహదారులు

Vinukonda: వినుకొండలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం. ప్రధాన రహదారులు జలమయం, డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహనదారుల తీవ్ర అవస్థలు.

KAREEMULLA, VINUKONDA
Published on: 7 Sept 2026 7:57 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో భారీ వర్షం.. జలమయమైన రహదారులు

Vinukonda: వినుకొండ పట్టణంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. దాదాపు రెండు గంటల పాటు వర్షం కురవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భారీ వర్షానికి పట్టణంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. మురుగు నీటితో పాటు వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు నీరు నిలవడంతో రోడ్లు చెరువులను తలపించాయి.రోడ్లపై భారీగా నీరు నిలవడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాహనాలు నడపడం కూడా కష్టంగా మారింది. మరోవైపు పాదచారులు రోడ్లపై వెళ్లేందుకు ఇబ్బందులు పడుతూ, నీటిలోనే నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతోనే వర్షం పడిన ప్రతిసారీ రోడ్లపై నీరు నిలుస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు, మురుగునీరు త్వరగా బయటకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story