Vinukonda: ₹1.93 కోట్లతో పిహెచ్‌సి భవనానికి చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శంకుస్థాపన

Vinukonda: పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలులో ₹1.93 కోట్ల వ్యయంతో పీహెచ్‌సీ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.

KAREEMULLA, VINUKONDA
Published on: 28 Aug 2026 1:53 PM IST
Vinukonda
X

Vinukonda: ₹1.93 కోట్లతో పిహెచ్‌సి భవనానికి చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శంకుస్థాపన

Vinukonda: వినుకొండ నియోజకవర్గం,నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో రూ.1.93 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే లక్ష్యంతో ప్రజల ఆరోగ్య ప్రమాణాలతో పాటు జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు సైతం గ్రామీణ ప్రజలు దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సమీపంలోనే మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌’ సాధించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా ఆధునిక సాంకేతికతను వినియోగించి ప్రజల ఆరోగ్య వివరాలను డిజిటల్ విధానంలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. అవసరమైన వైద్య సేవలు, మందులను మరింత సమర్థంగా అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.ఐనవోలు పీహెచ్‌సీ నూతన భవనం పూర్తయి అందుబాటులోకి వస్తే ఐనవోలుతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింత చేరువవుతాయని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story