Vinukonda: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు.. రైతులకు కొత్త పాస్‌బుక్స్!
Vinukonda: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి, రాజముద్రతో కూడిన కొత్త పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.
Vinukonda: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు.. రైతులకు కొత్త పాస్‌బుక్స్!
వినుకొండ: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను పూర్తిగా రద్దు చేసి భూములపై పూర్తి హక్కులు రైతులకే కల్పించినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం సరికొండపాలెం గ్రామంలో నిర్వహించిన 'మీ భూమి – మీ హక్కు' కార్యక్రమంలో రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.
గతంలో పాసు పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండటంతో బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న కొత్త పాసు పుస్తకాలు జీవితాంతం చెల్లుబాటుతో ఉండటంతో పాటు, ఏ బ్యాంకులోనైనా రుణాలు పొందేందుకు ఉపయోగపడతాయని చెప్పారు.
పాసు పుస్తకాలపై ఉన్న QR కోడ్ ద్వారా భూమికి సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించినట్లు వివరించారు. పాసు పుస్తకాలలో ఏవైనా తప్పులు ఉంటే 15 రోజులలోపు సవరించే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. రైతుల భూ హక్కులకు సంపూర్ణ రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు.




