Gurazala: పాత పాటేశ్వరి ఆలయంలో ఎంపీ, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
Gurazala: గురజాల పాత పాటేశ్వరి ఆలయంలో శ్రావణ మాస నాలుగో శుక్రవారం సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Gurazala: పాత పాటేశ్వరి ఆలయంలో ఎంపీ, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
గురజాల: గురజాల పట్టణంలోని గ్రామ దేవత అయిన శ్రీ పాత పాటేశ్వరి ఆలయంలో శ్రావణ మాస నాలుగవ శుక్రవారం సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చీతురాల సుబ్బారావు వారికి శాలువాతో సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. మండల దేవాదాయ శాఖ అధికారి పూర్ణచంద్రరావు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




