Guntur: పోలేరమ్మ కొలుపుల ఉత్సవంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి!

Guntur: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైభవంగా జరిగిన పోలేరమ్మ తల్లి కొలుపుల మహోత్సవం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 6 Sept 2026 6:25 PM IST
Guntur
X

Guntur: పోలేరమ్మ కొలుపుల ఉత్సవంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి!

Guntur: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ వడ్డెగూడెం,19వ డివిజన్ నల్లచెరువు 4వ లైన్‌లో జరిగిన పోలేరమ్మ అమ్మవారి కొలుపుల మహోత్సవ కార్యక్రమాలకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించే అమ్మవారి కొలుపులు ప్రజల విశ్వాసాలకు నిదర్శనమని, ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులతో సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆకాంక్షించారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగాఅమలవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story