Guntur: చంద్రబాబు అరెస్టు రోజు ‘బ్లాక్ డే’: పిల్లి మాణిక్యరావు!

Guntur: చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సెప్టెంబర్ 9 బ్లాక్ డే అని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు పేర్కొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 9 Sept 2026 10:39 PM IST
Guntur
X

Guntur: చంద్రబాబు అరెస్టు రోజు ‘బ్లాక్ డే’: పిల్లి మాణిక్యరావు!

గుంటూరు: మూడు సంవత్సరాల క్రితం 2023 సెప్టెంబర్ 9న అర్ధరాత్రి 2 గంటల సమయంలో చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రికి తరలించి 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించారని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు అన్నారు.

బుధవారం గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. చంద్రబాబు నాయుడిపై ఎలాంటి ఆధారం లేకుండా, ఎఫ్‌ఐఆర్‌లో పేరు కూడా లేకుండా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని మాణిక్యరావు ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులకు నైపుణ్యాలు అందించి, యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన చంద్రబాబుపై రూ.3 వేల కోట్లు, రూ.300 కోట్లు, రూ.100 కోట్ల అవినీతి జరిగిందంటూ పిచ్చి పిచ్చి నిందలు వేశారని విమర్శించారు.

చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసిన ఈ రోజును బ్లాక్ డేగా గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యం హత్యకు గురైందని ప్రపంచవ్యాప్తంగా మాట్లాడిన రోజుగా ఈ రోజును గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఈ రోజును గుర్తుపెట్టుకోకపోతే ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించుకున్నామో ప్రజలకు తెలియదన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story