Guntur: గుంటూరు హోటల్‌లో పేకాట స్థావరంపై దాడి ఆరుగురు అరెస్ట్!
Guntur: గుంటూరు నల్లపాడు పరిధిలోని హోటల్ సిద్ధివీర్ గ్రాండ్లో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి. ఆరుగురు అరెస్ట్, నగదు, ఫోన్లు స్వాధీనం.
Guntur: గుంటూరు హోటల్‌లో పేకాట స్థావరంపై దాడి ఆరుగురు అరెస్ట్!
Guntur: నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ రోడ్ వద్ద గల హోటల్ సిద్ధివీర్ గ్రాండ్లో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ బృందం ఆదివారం 06.09.2026 రాత్రి సుమారు 08:20 గంటలకు దాడి నిర్వహించింది.
DSB DSP గారి ఆదేశాల మేరకు సమాచారం టాస్క్ ఫోర్స్ CI-2 గారికి తెలియజేసి, టాస్క్ ఫోర్స్ సిబ్బంది నల్లపాడు పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి హోటల్‌లోని రూమ్ నెంబర్ 205పై దాడి చేశారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.6,200 నగదు, 6 సెల్‌ఫోన్లు, 1 ద్విచక్ర వాహనం సీజ్ చేశారు. అనంతరం అదుపులోకి తీసుకున్న వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని తదుపరి చట్టపరమైన విచారణ మరియు చర్యల నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్ సిబ్బందికి అప్పగించారు.
గుంటూరు జిల్లా పరిధిలో పేకాట, జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉంచి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.




