Guntur: కూటమి ప్రభుత్వ పాలనకు జనం జై ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్!
Guntur: కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. తెనాలిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Guntur: కూటమి ప్రభుత్వ పాలనకు జనం జై ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్!
Guntur: కూటమి ప్రభుత్వ పాలనలో అభివృధ్ధి, సంక్షేమం ద్వారా ప్రజల నుండి వస్తున్న సానుకూల స్పందనను ప్రతి ఇంటి తలుపుతట్టి వారి అనందం ద్వారా తెలుసుకుంటున్నామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రజల స్పందనను మీడియాతో పంచుకున్నారు.
రెండేళ్ళనమ్మకం అభివృధ్ధి సంక్షేమం ఇంటింటి ప్రచారంలో భాగంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ శ్రేణులతొ కలిసి గురువారం పలు వార్డులలో ఇంటింటి ప్రచారం చేపట్టారు.ఆయా వార్డులలో మహిళలతొ మాట కలిపి కూటమి పాలనలో అందుతున్న సంక్షేమం గురించి తెలుసుకున్నారు.
మహిళల నుండి సానుకూల స్పందన లభించడం పట్ల, కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలన్న సంకేతాన్నిస్తు సంక్షేమ కరపత్రాలు పంపిణీ చేశారు. వార్డు స్ధాయి నాయకులు ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్సీ ఆలపాటి వెంట సాగుతూ, కార్యక్రమంలో జోష్ పెంచారు.
ఈసందర్బంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతు డబుల్ ఇంజన్ సర్కార్ లో ప్రధాని మోదీ చత్రం క్రింద ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారాలోకెష్ త్రివేణీ సంగమం వలే, రాష్ట్రాభివృద్ది,ప్రజల సంక్షేమం,మహిళా సాధికారత,
నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన చేస్తున్న కృషివల్ల సాధిస్తున్న ఫలితాలు నభూతో నభవిష్యతి అన్నారు. ప్రజల నుండి వస్తున్న సానుకూలస్పందనను,ఎమ్మెల్సీ తమదైనశైలిలో వివరించారు.ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




