Guntur: కృష్ణుడి జీవితం అందరికీ మార్గదర్శకం - ఎమ్మెల్యే నసీర్
Guntur: గుంటూరులో కృష్ణాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే నసీర్ పాల్గొన్నారు. కృష్ణుడి జీవితం ప్రతి మానవుడికి మార్గదర్శకమని, భగవద్గీత సన్మార్గం చూపుతుందని అన్నారు.
Guntur: కృష్ణుడి జీవితం అందరికీ మార్గదర్శకం - ఎమ్మెల్యే నసీర్
గుంటూరు: కృష్ణుడి జీవితం ప్రతి మానవుడికి మార్గదర్శకమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు.
శుక్రవారం కృష్ణాష్టమి సందర్భంగా స్థానిక పాత గుంటూరులోని యాదవబజార్, మణి హోటల్ సెంటర్, ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా నవ్వుతూ ఎదుర్కొనే ధైర్యం కృష్ణుడి బాల్యం నేర్పుతుందని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి బోధించిన భగవద్గీత సమాజానికి సన్మార్గం చూపించదని చెప్పారు.
Next Story




