Ponnuru: లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే నరేంద్ర

Ponnuru: పొన్నూరులో అనారోగ్య బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్. రూ. 15.81 లక్షల ఆర్థిక సాయం అందజేత.

SHAREEF, PONNURU
Published on: 4 Aug 2026 2:21 PM IST
Ponnuru
X

Ponnuru: లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే నరేంద్ర

పొన్నూరు: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు సంగం డెయిరి చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్.

అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న, పొన్నూరు మండలంలోని 18 మంది లబ్ధిదారులకు ₹12,08,608/- రూపాయలు , పొన్నూరు పట్టణంలోని 10 మంది లబ్ధిదారులకు ₹3,73,095/-రూపాయల విలువగల చెక్కులను పొన్నూరు పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చుతో కూడిన చికిత్స చేయించుకోవటం కోసం ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ సహాయం కోసం అడిగితే అడిగిన వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు ఆర్థిక సహాయం అందజేశారని, వారు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోమని ఈ సందర్భంగా నరేంద్ర కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు పట్టణ మరియు మండల కూటమి ప్రభుత్వ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU

Next Story