Guntur: లామ్‌లో 'ఫార్మర్స్ హాస్టల్' ప్రారంభించిన ఎమ్మెల్యే రామాంజనేయులు

Guntur: గుంటూరు లామ్‌లోని KVK లో రూపుదిద్దుకున్న 'ఫార్మర్స్ హాస్టల్' భవనాన్ని ప్రారంభించిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు. ఆన్‌లైన్ ద్వారా హాజరైన రాజ్‌బీర్ సింగ్.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 29 Aug 2026 1:33 PM IST
Guntur
X

Guntur: లామ్‌లో 'ఫార్మర్స్ హాస్టల్' ప్రారంభించిన ఎమ్మెల్యే రామాంజనేయులు

Guntur: రైతులకు మరింత మెరుగైన సేవలు, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం అందించాలనే లక్ష్యంతో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, ICAR-ATARI జోన్-X, కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ఆధ్వర్యంలో గుంటూరు లాంలో నిర్మించిన ‘ఫార్మర్స్ హాస్టల్ బిల్డింగ్’ ఘనంగా ప్రారంభించిన గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు

ఈ కార్యక్రమానికి ICAR న్యూఢిల్లీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. రాజ్‌బీర్ సింగ్ గారు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ రైతులకు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు, వివిధ శిక్షణ కార్యక్రమాలకు హాజరయ్యే రైతులకు అవసరమైన వసతులు కల్పించడం ఎంతో ముఖ్యమన్నారు. రైతు బలోపేతమే రాష్ట్ర ప్రగతికి పునాది అని పేర్కొన్నారు.

కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నూతన వ్యవసాయ విధానాలు, పంటల సాగులో మెరుగైన పద్ధతులు, అధిక దిగుబడులు సాధించే సాంకేతికతపై అవగాహన కల్పించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లవచ్చన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఇటువంటి మౌలి.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story