Guntur: కిట్స్ కళాశాల అధ్యాపకురాలు రాగిణి శిఖాకొల్లికి పీహెచ్‌డీ
Guntur: ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎన్‌బీఎఫ్‌సీల డిజిటల్ పరివర్తనపై పరిశోధన పూర్తి చేసి పీహెచ్‌డీ అందుకున్న కిట్స్ కళాశాల అధ్యాపకురాలు రాగిణి శిఖాకొల్లి.
Guntur: కిట్స్ కళాశాల అధ్యాపకురాలు రాగిణి శిఖాకొల్లికి పీహెచ్‌డీ
గుంటూరు: వింజనంపాడు కె.కె.ఆర్. అండ్ కె.ఎస్.ఆర్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కిట్స్ కళాశాల)లో మేనేజ్మెంట్ స్టడీస్ విభాగానికి చెందిన శ్రీమతి రాగిణి శిఖాకొల్లి ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలోని ఎంపిక చేసిన NBFCల ఆధారంగా భారతదేశంలో NBFC డిజిటల్ పరివర్తన యొక్క నియంత్రణ, కార్యాచరణ మరియు వినియోగదారుల ఫలితాలపై పరిశోధన పూర్తి చేసి ,ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ప్రొఫెసర్ డా. అడ్డాడా నరసింహారావు గారి పర్యవేక్షణలో శ్రీమతి రాగిణి శిఖాకొల్లి చేసిన పరిశోధనకు డాక్టరేట్ లభించడం తమకెంతో గర్వకారణంగా ఉందని కళాశాల ఛైర్మన్ డా. కోయి సుబ్బారావు గారు అన్నారు.
తమ కళాశాలకు చెందిన శ్రీమతి రాగిణి శిఖాకొల్లి. ప్రస్తుత డిజిటల్ యుగంలో NBFCల కార్యకలాపాల్లో డిజిటల్ టెక్నాలజీ, ఆన్‌లైన్ రుణ సేవలు, డిజిటల్ చెల్లింపులు, ఆటోమేషన్, డేటా ఆధారిత నిర్ణయాలు మరియు డిజిటల్ కస్టమర్ సర్వీసులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ పరివర్తన సంస్థల కార్యకలాపాల సామర్థ్యం, సేవల వేగం, పారదర్శకత మరియు వినియోగదారుల సంతృప్తిపై చూపుతున్న ప్రభావాన్ని పరిశోధనలో పరిశీలించారు.
ఈ ఘనత సాధించిన డా.రాగిణి శిఖాకొల్లి గారిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరెన్నో పరిశోధనలు చేపట్టి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. తమ కళాశాలలో అధ్యాపకులను వివిధ పరిశోధనల దిశగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.డా. రాగిణి శిఖాకొల్లి గారిని కళాశాల కార్యదర్శి శ్రీ కోయి శేఖర్ గారు, ప్రిన్సిపల్ డా. పి. బాబు గారు, అకడమిక్ డైరెక్టర్ డా. కె. హరిబాబు గారు మరియు విభాగాధిపతి డా. బి భాను ప్రకాష్ గారు ,సహా అధ్యాపకులు అభినందిస్తూ, ఆమెకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.




