Guntur: సెప్టెంబర్ 7న జీఎంసీ ముట్టడి సీపీఎం నగర కార్యదర్శి పిలుపు

Guntur: ఎన్టీఆర్ కాలనీల సమస్యలపై సెప్టెంబర్ 7న గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 2 Sept 2026 6:06 PM IST
Guntur
X

Guntur: సెప్టెంబర్ 7న జీఎంసీ ముట్టడి సీపీఎం నగర కార్యదర్శి పిలుపు

గుంటూరు: యన్‌టిఆర్ నగర్ (జగనన్న కాలనీ)లలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి, మౌలిక సౌకర్యాలు కల్పిచాలని, టిడ్కో గృహ లబ్ధిదారులకు బ్యాంకు ఋణాలు రద్దు చేయాలని, టిడ్కో గృహం కేటాయింపు చేసి వివిధ కారణాలతో అనర్హులుగా ప్రటించిన వారికి డిపాజిట్ డబ్ము తిరిగి చెల్లించాలి లేదా వారి కుటుంబ సభ్యులకు ఇంటిని కేటాయించాలని చేయాలని, నగరంలో రోడ్లు, డ్రైనేజి ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుత ఈ నెల (సెప్టెంబర్) 7వ తేదీన గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో ప్రజలు పాల్గొని, తమ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావాలని సిపియం నగర కార్యదర్శి కె. నళినీకాంత్ కోరారు.

బుధవారం స్థానిక 2/7 బ్రాడీపేటలోని సిపియం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నళినీకాంత్ మాట్లాడుతూ పాత జగనన్న కాలనీ, ప్రస్తుత యన్.టి.ఆర్. కాలనీల్లో ఐదు సంవత్సరాల తరువాత కూడా ఒక్క శాతం కుటుంబాలు కూడా నివాసం ఉండలేని దుస్థితి ఉందని, సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ‘బూడిదలో పోసిన పన్నీర’య్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గుంటూరు చుట్ట ప్రక్కల 9 ప్రాంతాల్లో గుంటూరు మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు 67,768 మందికి ఇళ్ళస్థలాలు కేటాయిస్తే కేవలం 6 నుండి 7 వందలు మంది మాత్రమే నివాసముంటున్నారని అన్నారు. ప్రస్తుతం నిర్మాణం జరిగిన ఇళ్ళలో 90-95% గత ప్రభుత్వమే కాంట్రక్టర్‌ల ద్వారా కట్టించిందని, కాంట్రాక్టర్‌ల అవినీతి, కనీస జాగ్రత్త లేని కారణంగా దాదాపు అన్ని ఇళ్ళు గోడలు పగుళ్ళు రావటం, స్లాబ్ నుండి నీళ్ళు కారటం, మొత్తంగా నివాసయోగ్యంగా లేకుండా పోయాయని తెలియచేశారు.

గత 2 సంవత్సరాలుగా యన్‌టిఆర్ నగర్‌ల అభివృద్ధికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటంతో ఆ కాలనీల పరిస్థితి మరింత దిగజారిందన్నారు. ప్రభుత్వ ఆర్ధిక సహాయానికి తోడు లబ్ధిదారులు తమ స్వంత డబ్బు వెచ్చించి ఇంటి నిర్మాణం చేసుకొని నివాసం ఉంటున్న వారికి మంచినీరు, రోడ్లు, వీధిలైట్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించే బాధ్యత నగరపాలక సంస్థ తీసుకోకపోవటం విచారకరమన్నారు.

అక్కడ నివాసం ఉంటున్న వారికి ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేకపోవటంతో పెన్షన్లు, రేషన్, ఓట్ల వెరిఫికేషన్, ఇతర ప్రభుత్వ పథకాల కోసం గతంలో అద్దెకు నివాసం ఉన్న చోటకు వెళ్ళాల్సి దుస్థితి వచ్చిందన్నారు. దీనితో ఖర్చులు పెరిగి స్వంత ఇంటి ఆనందం వదులుకొని ఎక్కువ మంది యన్‌టిఆర్ నగర్‌లు ఖాళీచేసి వెళుతున్నారని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కాలనీలలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు కల్పించాలని నళినీకాంత్ కోరారు.

సిపియం జిల్లా కమిటి సభ్యులు బి.ముత్యాలరావు మాట్లాడుతూ టిడ్కో గృహాల నిర్మాణం 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైనా ఇప్పటికి 50% మంది మాత్రమే నివాసం ఉంటున్నారని తెలిపారు. అద్దె భారం తప్పిందని భావిస్తే టిడ్కో గృహంలోకి వెళ్ళకముందే 7 సంవత్సరాలుగా బ్యాంకు ఇ.యం.ఐలు కట్టాల్సివచ్చిందని, ఒకవైపు అద్దె భారం, రెండవ వైపు ఇ.యం.ఐల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రభుత్వ తప్పిదం కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి టిడో గృహ లబ్ధిదారుల బ్యాంకు ఋణాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే టిడో ఇల్లు శాంక్షన్ అయిందని నగదు డిపాజిట్ చేసిన తరువాత పెద్ద వయస్సు, ఇతర కారణాలతో కొంత మందిని అనర్హులుగా ప్రకటించారని, వారు చెల్లించిన నగదు డిపాజిట్ వెనక్కి ఇవ్వటం కానీ, వారి కుటుంబ సభ్యులకు టిడ్కో ఇల్లు కేటాయించటం కాని చేయలేదన్నారు. టిడ్కో ఇళ్ళలో నివాసం ఉంటున్న వారికి నీళ్ళు, డ్రైనేజి, పారిశుద్ధ్యం, తదితర సమస్యలు వెంటాడుతున్నాయని, తక్షణమే నగరపాలక సంస్థ అధికారులు సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు.

విలేకరుల సమావేశంలో సిపియం నగర కార్యదర్శివర్గ సభ్యులు కట్లగుంట శ్రీనివాసరావు, నగరకమిటి సభ్యులు షేక్ ఖాశీం షహీద్ పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story