Guntur: గుంటూరులో 3 రోజుల్లో రోడ్ల గుంతలు పూడ్చాలి కమిషనర్ ఆదేశాలు!

Guntur: గుంటూరు నగరంలో మూడు రోజుల్లో పాట్ హోల్స్ పూర్తిస్థాయిలో పూడ్చాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ ఆదేశించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 3 Sept 2026 10:45 AM IST
Guntur
X

Guntur: గుంటూరులో 3 రోజుల్లో రోడ్ల గుంతలు పూడ్చాలి కమిషనర్ ఆదేశాలు!

Guntur: గుంటూరు నగరంలోని పాట్ హోల్స్ కు మూడు రోజుల్లో మరమ్మతులు నిర్వహించి గుంటలను పూడ్చాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నగర పాలక సంస్థలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఇంజనీరింగ్ అధికారులు మరియు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇప్పటికే నగరంలో రెండవ విడత పూడికతీత పనులు చాలా వరకు పూర్తయ్యాయని, ఇంకా ఏమైనా పూడికతీత పనులు మిగిలి ఉంటె సదరు ప్రాంతాలలో యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కల్వర్ట్ లు ఉన్న ప్రాంతాలలో సరిగా సిల్ట్ తొలగించుట లేదని పిర్యాదులు అందుతున్నాయని, వాటి పై ప్రత్యేక ద్రుష్టి సారించాలని, కాలువల్లో తీసిన సిల్ట్ ను వెంటనే సదరు ప్రాంతం నుండి తొలగించాలని అధికారులను ఆదేశించారు.

అలాగే నగరంలో ఉన్న పాట్ హొల్స్ కు రానున్న 3 రోజుల్లో మరమ్మతులు నిర్వహించాలని, ఎక్కడా కూడా పాట్ హోల్స్ కనబడకూడదని, ఏ.ఈ లు క్షేత్ర స్తాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. ముఖ్యంగా ఏ.ఈ లు వారి పరిధిలో త్రాగునీటి సరఫరా పై ద్రుష్టి సారించాలని, ఎక్కడా కలుషిత నీరు సరఫరా జరగకుండా పర్యవేక్షించాలని, త్రాగు నీటి సరఫరా జరుగు సమయంలో ఈ.యల్.యస్.ఆర్ లలో మరియు గృహాల వద్ద నీటి శాంపిల్స్ విధిగా నూరు శాతం సేకరించాలని ఆదేశించారు.

అలాగే వాటర్ మీటర్ రీడింగ్ తప్పకుండా తీయాలని, అవసరమైన ప్రాంతాలలో నూతన మీటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఏఈ లను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, టెండర్ ప్రక్రియ పూర్తైనా పనులు ప్రారంభం కాని పనులను రద్దు చేయాలని, అభివృద్ధి పనులు జరిగే సమయంలో ఏ.ఈలు ప్రత్యక్షంగా పనులను పర్యవేక్షించాలన్నారు.

నగరంలోని పార్కులు, స్మశాన వాటికల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, 15వ ఆర్ధిక సంఘ నిధులతో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రజల నుండి అందే పిర్యాదులను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలని, సమస్య పరిష్కరించే ముందు తరువాత ఫోటోలను తప్పనిసరిగా అప్ లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా యు.జి.డి మరియు త్రాగు నీటి సరఫరా పై వచ్చే పిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పత్రికలలో వచ్చే వ్యతిరేక వార్తలకు వెంటనే స్పందించి, సదరు సమయాలను పరిష్కరించాలని ఆదేశించారు.

సమావేశంలో యస్.ఈ (ఇంచార్జ్) సుందర్రామి రెడ్డి, ఈఈలు విష్ణు మూర్తి, వేణుగోపాల్, డి.ఈ.ఈ లు, ఏ.ఈ లు తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story