Guntur: గుంటూరులో PGRSను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ సాయికాంత్ వర్మ

Guntur: గుంటూరు జిల్లా ప్రజలు ప్రతీ సోమవారం జరిగే PGRSను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ విజ్ఞప్తి. టోల్ ఫ్రీ 1100 వివరాలు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 30 Aug 2026 1:52 PM IST
Guntur
X

Guntur: గుంటూరులో PGRSను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ సాయికాంత్ వర్మ

Guntur: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)ను ప్రతీ సోమవారం జిల్లా, మండల స్థాయిలో అన్ని కార్యాలయాల్లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు.

పి.జి.ఆర్.ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100 కు ఫోన్ చేసి ఆర్జీల వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. మీ కోసం వెబ్ సైట్ లో ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు నేరుగా సోమవారం నిర్వహిస్తున్న పి.జి.ఆర్.ఎస్ లో అర్జీలు సమర్పించవచ్చని లేదా మీ కోసం వెబ్ సైట్.

Meekosam.ap.gov.in(మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) లో కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పి.జి.ఆర్.ఎస్ కు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1100 ను వినియోగించుకొని, ఆర్జీల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని సూచించారు. క్యూఆర్ కోడ్ ద్వారా స్పందన తెలియజేయవచ్చని చెప్పారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story