Guntur: 22ఏ సమస్యపై గుంటూరు కలెక్టర్‌ను కలిసిన ఏబీవీ
Guntur: రాజధాని రైతుల సమస్యలపై గుంటూరు కలెక్టర్‌ను కలిసిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు. 22ఏ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్.
Guntur: 22ఏ సమస్యపై గుంటూరు కలెక్టర్‌ను కలిసిన ఏబీవీ
గుంటూరు: రాజధాని రైతుల తో కలిసి గుంటూరు జిల్లా కలెక్టర్ ను కలిసిన మాజీ ఇంటిలిజెన్స్ ఏబీ వెంకటేశ్వరరావు. 22 ఏ వలన రాష్ట్రంలో అలజల్లు దౌర్జన్యాలు పెరిగే అవకాశం ఉంది. రైతుకు తెలియకుండా 22 ఎ లో పెట్టడమే కబ్జాలకు ప్రభుత్వమే ప్రోత్సహించినట్లు అవుతుంది.
ఈ సమస్య ఒక భూతం లాంటిది, దీనికి తక్షణమే పుల్ స్టాప్ పెట్టాలి. రాజధాని ప్రాంతంలో 774 సర్వేలో 30 ఎకరాలు 22 ఏ లో పెట్టారు. కలెక్టర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు గత మూడు నెలల్లో 400 ఎకరాలు 22 ఏ నుండి తొలగించారు. రాష్ట్రవ్యాప్తంగా వక్ భూములతో కలుపుకొని 22 లక్షల ఎకరాలు 22ఏ లో ఉన్నాయి.
ప్రభుత్వ భూమి ఉంటే నోటీసులు ఇచ్చి తీసుకోవచ్చు. ఎక్కడో ఒక తప్పు జరిగితే 99 మందిని ఇబ్బంది పెడుతున్నారు. 22 ఏ లో ఉన్న విషయం తెలుసుకొని ఆక్రమణదారులు, ఎమ్మెల్యే ,ఎమ్మార్వో లను కలుపుకొని ఆక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ సమస్య రోజురోజుకు జటిలం అవుతుంది శాశ్వత పరిష్కారం చూపాలి.
22 ఏకు శాశ్వత పరిష్కారం రోల్ బ్యాంక్ మాత్రమే. 22 ఏ కేసులు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. తమ పొలాలు, స్థలాలు 22 ఏ లో ఉన్న బాధితులందరూ అప్రమత్తంగా మొత్తంగా ఉండాలి. ఎవరు చొర పడకుండా చూసుకోండి, స్థానిక పోలీస్ స్టేషన్లోనూ, లేదా రాజధాని ప్రాంతంలో రైతు సమస్యల కోసం ఏర్పాటుచేసిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయండి.




