Guntur: గుంటూరులో చెత్త పాయింట్లు లేకుండా శుభ్రం చేయాలి!
Guntur: గుంటూరులో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు లేకుండా 100% ఇంటింటి చెత్త సేకరణ జరగాలని జిఎంసి కమిషనర్ కె.మయూర్ అశోక్, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతి కళ ఆదేశించారు.
Guntur: గుంటూరులో చెత్త పాయింట్లు లేకుండా శుభ్రం చేయాలి!
Guntur: గుంటూరు నగరంలో గార్బేజ్ పాయింట్లు లేకుండా, ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని నగర పాలక సంస్థ సి.యమ.ఒ.హేచ్ డాక్టర్ శాంతి కళ తెలిపారు. శనివారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శానిటరీ ఇన్స్పెక్టర్లతో ప్రజారోగ్య విభాగా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో డోర్ టు డోర్ చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉండడానికి వీలులేదని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. మెరుగైన పారిశుధ్య పనుల నిర్వహణకు పూర్తి స్థాయిలో వాహనాలు, కార్మికులను కేటాయించామని, పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లలక్ష్యం వహించవద్దన్నారు. కార్మికుల హాజరు తప్పనిసరిగా ఎఫ్ఆర్ఎస్ ద్వారానే తీసుకోవాలని, దాని ప్రకారమే జీతాలు చేస్తారన్నారు.
ఉదయం ఇంటింటి చెత్త సేకరణ, మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ అధిక ప్రాధాన్యత ఇస్తూ డ్రైన్లను ప్రతి రోజు శుభ్రం చేయాలన్నారు. డ్రైన్లలో తొలగించిన వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తరలించాలన్నారు. ప్రధాన రోడ్ల వెంబడి ఏర్పాటు చేసిన ట్విన్ బిన్స్ లో చెత్తని ప్రతి రోజు లిఫ్ట్ చేయాలన్నారు. అన్న క్యాంటీన్ల వద్ద పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు.
గుంటూరు నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేదం ఉన్నందున, వ్యాపారస్తులు ఎవరూ కూడా ప్లాస్టిక్ వాడకుండా మరియు విక్రయాలు చేయకుండా చూడాలని, ఎవరైనా వ్యాపారస్తులు సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడినట్లైతే వారికి అపరాధ రుసుము విధించాలన్నారు. అంతేకాక ప్లాస్టిక్ వాడకం వలన కలిగే అనర్ధాల పై ప్రజలకు వగాహన కలిగించాలన్నారు. నగరంలో వ్యాపారాలు నిర్వహించే ప్రతి షాప్ యజమానికి తప్పనిసరిగా డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని, లైసెన్స్ గడువు ముగిసిన షాపులకు లైసెన్స్ రెన్యువల్ చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. నగరంలోని ఖాళీ స్థలాలు, నీరు నిలిచే ప్రాంతాల్లో దోమలు వృద్ది చెందకుండా యాంటి లార్వ మందులను స్ప్రే చేయించాలని బయాలజిస్ట్ ని ఆదేశించారు.
సమావేశంలో ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, బయాలజిస్ట్ శేషయ్య, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.




