Guntur: గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంఎస్‌యూ పనుల పరిశీలన!
Guntur: గుంటూరు మెడికల్ కాలేజీలో నిర్మాణంలో ఉన్న మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ (MSU) పనులను నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గురువారం పరిశీలించారు.
Guntur: గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంఎస్‌యూ పనుల పరిశీలన!
గుంటూరు: ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా వ్యాధులను ముందుగానే గుర్తించించడానికి ఎంఎస్యూ(మెట్రో పాలిటన్ సర్వైవల్ యూనిట్)ల పాత్ర ఎంతో కీలకమని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. గురువారం స్థానిక గుంటూరు మెడికల్ కాలేజీలో నిర్మాణంలో ఉన్న ఎంఎస్యూను పరిశీలించి, పెండింగ్ పనుల పూర్తిపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఎంఎస్యూ లను నిర్మించడానికి చర్యలు చేపట్టిందని, వీటిలో మన రాష్ట్రంలో గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంఎస్యూని నిర్మాణం చేయడానికి అనుమతి ఇచ్చిందన్నారు. ఈ ఎంఎస్యూల వలన ప్రజా ఆరోగ్యంపై ముందస్తు నిఘాను బలోపేతం చేయడం, వ్యాధుల వ్యాప్తిని ముందుగానే గుర్తించడం.
అందుకు తగిన విధంగా ప్రతిస్పందన యంత్రాంగాలను సిద్దం చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో వీటి పాత్ర ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుందన్నారు. ఎంఎస్యూను త్వరగా అందుబాటులోకి తీసుకురావడం వలన ఆరోగ్య గుంటూరు సాధనకు వీలుకల్గుతుందని పేర్కొన్నారు. పర్యటనలో సిఎంఓహెచ్ డాక్టర్ శాంతి కళ, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడిసీ) ప్రతినిధులు వై.శ్రీనివాస్, ల్యాబ్ నిపుణులు జితేందర్ పాండే పాల్గొన్నారు.




