Kolluru: కొల్లూరులో ఉచిత క్యాన్సర్ పరీక్షలు

Kolluru: బాపట్ల జిల్లా కొల్లూరులో బసవతారకం ఆసుపత్రి సహకారంతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం.

KIRAN BABU,	VEMURU
Published on: 7 Jun 2026 8:34 PM IST
Kolluru
X

Kolluru: కొల్లూరులో ఉచిత క్యాన్సర్ పరీక్షలు

బాపట్ల జిల్లా: కొల్లూరులో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మరో ముఖ్యమైన అడుగు పడింది. బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షులు కనగాల మధుసూదన్ ప్రసాద్ ఆధ్వర్యంలో, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.

కొల్లూరు మాత్రమే కాకుండా పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నారు. క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని వైద్య నిపుణులు అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో క్యాన్సర్‌పై ఉన్న అపోహలను తొలగిస్తూ, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతను వివరించారు.

ముఖ్యంగా మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి వ్యాధులపై ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

KIRAN BABU,	VEMURU

KIRAN BABU, VEMURU

Next Story