Bapatla: బాపట్ల వియ్యంకుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు ఘన నివాళి!
Bapatla: బాపట్ల వియ్యంకుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు.. మండల కార్యాలయం వద్ద నివాళులర్పించిన ఫోరం ఫర్ బెటర్ బాపట్ల.
Bapatla: బాపట్ల వియ్యంకుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు ఘన నివాళి!
Bapatla: భారతీయ తత్వశాస్త్ర విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించి, భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారు ఆయన. ఆయన రచించిన గ్రంథాలు అజరామరమైనవి.
భారతరత్న పురస్కారాన్ని అందుకొని, ఉపాధ్యాయులకు ఎనలేని ఖ్యాతినిఆర్జించి పెట్టారు. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి, అత్యున్నత స్థానానికి చేరుకోవడంలో ఆయన చేసిన కృషి అనన్య సామాన్యమైనది. యునెస్కో అధ్యక్షుడిగా పని చేసి, దేశ ఖ్యాతిని దశదిశలా చాటారు. బాపట్ల కు చెందిన కామరాజు హనుమంతరావుకు తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించి, బాపట్ల వియ్యంకుడిగా, మనకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టారు.
డాక్టర్ సర్వేపల్లి జయంతి సందర్భంగా శనివారం పోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో మండల కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి డాక్టర్ పి సి సాయిబాబు, సబ్ ట్రెజరీ అధికారి ఏ పరిశుద్ధ రావు, న్యాయవాదులు జమృద్ బాషా, తిరువీధుల శంకర ప్రసాద్, చంద్రారెడ్డి, నర్రా సాంబు తదితరులు పాల్గొన్నారు.




