Chirala: కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగించాలి ఆర్డీఓకు వైఎస్సార్సీపీ వినతి!
Chirala: చీరాలలో కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పెంచాలని ఆర్డీఓకు వైఎస్సార్సీపీ నాయకుల వినతి. సర్వర్ సమస్యలు, అధికారులపై ఒత్తిడి కారణంగా విజ్ఞప్తి.
Chirala: కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగించాలి ఆర్డీఓకు వైఎస్సార్సీపీ వినతి!
Chirala: చీరాల నియోజకవర్గ పరిధిలో కొత్తగా పెన్షన్లు పొందేందుకు అర్హత ఉన్న లబ్ధిదారులకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరింత సమయం ఇవ్వాలని వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. కేవలం ఏడు పని దినాల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించడం వల్ల అర్హులైన అనేక మంది లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు.
చీరాల పట్టణ అధ్యక్షుడు యాతం మేరీ బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు చీరాల ఆర్డీఓను కలిసి సమస్యలను వివరించారు. చీరాల మున్సిపాలిటీలోని 25 సచివాలయాల పరిధిలో దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి అధికారులు ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్), ఎన్నికల ప్రక్రియతో పాటు ఇతర విధుల్లో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కేవలం ఏడు పని దినాల్లో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించడం వల్ల నిజమైన అర్హులకు న్యాయం చేయడం కష్టమవుతుందని పేర్కొన్నారు.
సర్వర్ సమస్యతో మరిoత ఇబ్బందులు
కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు లబ్ధిదారులు సచివాలయాలకు వస్తున్నప్పటికీ సర్వర్ సకాలంలో పనిచేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాయకులు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. పని వేళల్లో కూడా సర్వర్ అందుబాటులో లేకపోవడంతో అధికారులు సైతం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఒకవైపు అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుండగా, మరోవైపు సర్వర్ సమస్యలు, అధికారులపై ఉన్న పని ఒత్తిడి, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు కారణంగా దరఖాస్తుల ప్రక్రియ సజావుగా సాగడం లేదన్నారు. దీనివల్ల నిజమైన అర్హత ఉన్న పేదలు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గడువు పొడిగించాలని వినతి
లబ్ధిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొత్త పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరారు. సర్వర్ సమస్యలను పరిష్కరించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తగినంత సమయం ఇస్తే నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పథకం ప్రయోజనాలు అందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల పట్టణ అధ్యక్షుడు యాతం మేరీ బాబు, బాపట్ల జిల్లా మున్సిపాలిటీ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ బత్తుల అనిల్, మాజీ కౌన్సిలర్ గుంటూరు ప్రభాకర్‌రావు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు చెల్లి బాబురావు, తొట్టెంపూడి ఇన్నయ్య, బొల్లాపల్లి అనిల్, యువజన విభాగం నాయకులు కంచర్ల చక్రవర్తి, సోషల్ మీడియా విభాగం నాయకులు సల్లూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.




